బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం బీసీ కులగణన సర్వే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి నల్గొండ, బతుకమ్మ : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని మంత్రి కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ప్రజల విజ్ఞప్తితోనే మరోసారి బీసీ కులగణన నిర్వహిస్తున్నామన్నారు. పారదర్శకంగా సర్వే చేసినా విపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. సర్వే అనంతరం ప్రత్యేక సెషన్ పెట్టి పార్లమెంట్‌కు బిల్లులు పంపుతామన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు.