Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 1:31 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే..

. కేటీఆర్  ది అబద్ధపు ప్రచారం

. మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శ

బాన్సువాడ, బతుకమ్మ :  బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్సువాడలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోవడంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.