Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 4:42 pm Posted by : ramakrishna

బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ లో చేరిక

  • కండువా కప్పి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజవర్గం డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామనికి చెందిన టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పైడిపల్లి నరసయ్య బర్దిపూర్ కాంగ్రెస్ పార్టీ  గ్రామ శాఖ  ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు. రూరల్ ఎమ్మెల్యే పైడిపల్లి నరసయ్యను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు   పైడి నర్సయ్యతో పాటు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాల ఆకర్షితులై  బిజెపి టిఆర్ఎస్ కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు  ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అన్నారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే  నేరుగా కలిసి  చెప్పాలని సూచించారు.  తరుణ్ కుమార్, యశ్వంత్,, సంజీవ్ గౌడ్,  అనంత్, సాయికుమార్, అభిలాష్,మహమ్మద్ అయాన్,మహమ్మద్ అఫ్రీన్ లు కాంగ్రెస్ పార్టీ చేరినారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్  అధ్యక్షులు సతీష్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్, మాజీ సర్పంచ్ ఈగ నారాయణ రెడ్డి,మాజీ ఎం పి టి సీ సాయిలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పాల్గొన్నారు.