బీఆర్ఎస్ రజతోత్సాహం
ఇందూర్ టు ఎల్కతుర్తి భారీ ఎత్తున తరలనున్న గులాబీ శ్రేణులు ప్రజలను తరలించేందుకు నాయకుల ప్రణాళికలు నిజామాబాద్, బతుకమ్మ: ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి 25 ఏళ్ల ఉత్సవానికి ముస్తాబవుతోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లనున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 17 నెలల తర్వాత బహిరంగ సభకు కేసీఆర్ పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపినట్లయింది. అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమౌతున్న...