‘టెస్సరాక్ట్’ భూ కుంభకోణంపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, బతుకమ్మ : రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘మెసర్స్ టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 5 ఎకరాల విలువైన ప్రజా భూమిని సంస్థకు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.135 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ప్రజా...