ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత జన్మదిన వేడుకలు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బాన్సువాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ లకు జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ రుద్రూర్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య...