బీసీ బందు కు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు
మాజీ ఎంపీటీసీలు మరంపల్లి సుధాకర్, చింతల దాసు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని మాజీ ఎంపీటీసీలు మారంపల్లి సుధాకర్, చింతల దాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ,బిజెపి నేతలు,తీరు చూస్తుంటే నోటితో మాట్లాడుతూ నొసలితో వెక్కిరిస్తున్నట్టు కనబడుతుందని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో బిజెపి ఎంపీలు 8 మంది ఉన్న పార్లమెంటులో బీసీల పక్షాన బీసీ రిజర్వేషన్ల కోసం నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం...