ఏర్గట్ల, బతుకమ్మ :
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్గట్ల మండల బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా 2001 లో జలదృశ్యంలో పురుడు పోసుకున్నదన్నారు. 25 ఏళ్ల ప్రయాణంలో అనేక ఒడిదొడుకులను తట్టుకుని నిలబడ్డదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఏర్గట్ల సొసైటీ అధ్యక్షుడు బర్మ నరసయ్య, క్యాతం సుభాష్ రెడ్డి, తడపాకల్ నలిన్, గడ్డం రమేష్, బద్దం ప్రభాకర్, బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఈరపట్నం నరేష్, బర్మ నరేష్, అట్లా పోశయ్య, జైన్, దొబ్బల రాజేష్, నిమ్మ గంగయ్య, గడ్డం మోహన్, కుశ లింబాద్రి, మారు నరేష్, గుండ్ల గంగాధర్, రాజారపు నరేష్, సంగెం ఆనంద్, సోమ లింగారెడ్డి, తానేష్, తాళ్ల రాంపూర్ దొర మోహన్, జక్కుల చిన్న నడిపి భూమన్న, ఏలేటి బాలకిషన్, పన్నాల శ్రీనివాస్, రొక్కెడ మోహన్, కూరాకుల పెద్ద భూమన్న, కూరాకుల సాదుల్ల, పడిగేల గంగారాం, బద్దం శ్యామ్, జక్కుల గణేష్, పారిపెల్లి రమేష్, మెరుగు మహేందర్, మెరుగు రంజిత్, మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.