హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. మూసీ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కోరారు. రైతుల యూరియా కష్టాల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.