రుణమాఫీ హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

వెబ్ న్యూస్, బతుకమ్మ :  రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.