కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని గోన్ గొప్పుల గ్రామానికి చెందిన బీయర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సమక్షంలో 50 మంది కాంగ్రెస్ కండ్వా కప్పుకొన్నారు. చేరిన వారిలో కొత్తూరు రాజగౌడ్, కుమ్మరి రాజన్న, కుమ్మరి బాలయ్య, బంగ్లా నర్సయ్య, బండారి సూర్యదాస్, మిట్టపల్లి నర్సయ్య, గొల్ల భోగన్న, బాంపెల్లి రాజన్న, పాశం రాజేశ్వర్, ఫకీర్ ఇబ్ర, చింతల జెని, కుమ్మరి బాలయ్య, సాకలి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.