బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

బతుకమ్మ, బాన్సువాడ :నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పస్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త డి.శివరాం గుండెపోటుతో గత 20 రోజుల క్రితం మరణించరు. కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా డి.శివరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధైర్యపడొద్దు మీ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు తెకుర్లా సాయిలు,గంపల శంకర్,లక్ష్మణ్,అల్లం రాములు మోసిన్, డి.సాయిలు,బద్రి దొంతి భాస్కర్,రాజు తదితరులు పాల్గొన్నారు.