Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 1:39 pm Posted by : ramakrishna

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ని పరామర్శించిన బి ఆర్ ఎస్ నేతలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్  శనివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న  బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి  ఆయనను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకుల పల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి వెంట బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

BRS leaders visit Rural MLA Bhupathi Reddy