బతుకమ్మ, కోటగిరి : గత వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల వల్ల కోటగిరి మండల కేంద్రంలో నేల కూలిన ఇళ్లను శనివారం టిఆర్ఎస్ నేతలు పరిశీలించారు. గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ఇల్లు నేలకూలి అద్దె ఇంట్లో ఉంటున్న పల్లికొండ సాయిలు అనిత దంపతులకు నగదును అందజేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాచూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులకు పంచాయతీ అధికారులకు ఇల్లు నేల కూలిన విషయాన్ని సమాచారమిచ్చి లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. అనంతరం గాండ్ల సాయిలు అనే వ్యక్తి ఇల్లు బ్రాహ్మణ గల్లి లో కూలిపోవడంతో ఇంటిని పరిశీలించారు ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో రేకులు వేసుకునేందుకు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డ వారి పక్షాన పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షంలో నిలవడం బి.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి నేలకూరిన ఇళ్లను సర్వే చేసి బాధిత కుటుంబాలకు పరిహార అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అధికారులు నేల కూలిన ఇళ్లను పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్, కిషన్, తెల్ల రవికుమార్, సహకార సొసైటీ ఉపాధ్యక్షులు బొట్టే గజేందర్, సమీర్, శంకర్ గౌడ్, బాబు పటేల్, కప్ప సంతోష్, నజీర్, మహేష్ రెడ్డి, తేల చిన్న అరవింద్, గౌతమ్, మామిడి నవీన్, యోగేష్, రుద్రంగి సందీప్, బోయ సంఘ అధ్యక్షులు సాయిలు పోశెట్టి, కుమ్మరి నాని, కుమ్మరి పోశెట్టి, కుమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.