Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:04 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని 218వ బూత్‌లో శుక్రవారం ఎస్ఐఆర్ ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఇషాక్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయడం, ఓటరు వివరాల్లోని తప్పులను సవరించడం, చిరునామా మార్పులు, ఇతర వివరాలను నవీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు నమోదు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే వార్డు ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్ఓలకు అవసరమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించడం, అర్హులైన ఓటర్లను చేర్చడం, తప్పులను సవరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదుకావాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు 4వ వార్డు నాయకుడు గంగారాం, బీఎల్ఓ వనజ, షేక్ ఖాలెత్, యాహియా ఖాన్, షేక్ మొహమ్మద్ పటేల్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.