Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 1:25 pm Posted by : ramakrishna

కాళేశ్వరం సందర్శన లో బిఆర్ఎస్ నేతల అడ్డగింత

 

. . . పెంబర్తి వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

. . . జిల్లా లలో బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

 వెబ్ డెస్క్ , బతుకమ్మ :

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బిఆర్ఎస్ నాయకులకు అడ్డంకులు తప్పడం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బయలుదేరిన గులాబి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి కన్నేపల్లి కి బయలు దేరిన మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేటిఆర్ తో పాటు బయలు దేరిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు బాల్క సుమన్, జీవన్ రెడ్డి , ధర్మ రెడ్డి, సతీష్ కుమార్ లను పోలీసులు బారికేడ్ లు పెట్టి అడ్డుకున్నారు.

BRS leaders intercepted during Kaleshwaram visit

ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి కారు పార్టీ నాయకులు ముందస్తు అరెస్టులు చేశారు. శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతిపై పోరాటం చేసిన బి ఆర్ ఎస్ పార్టి ఎకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ఎంచుకోవడంతో రాజకీయ వేడి రాజుకుంది.