తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, కల్లాలలో తడిసిపోయిన ధాన్యం కుప్పలను, తెగిపోయిన చెరువులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. మండల వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. రైస్ మిల్లు యజమానులు ధాన్యం రంగు మారిందని, తడిసిపోయిందని కొర్రెలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ...