Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 4:36 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ నాయకుల అరెస్టు 

బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుకులాలను సందర్శించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నస్రుల్లాబాద్ గురుకులానికి వెళ్లిన పార్టీ నాయకులకు అనుమతి లేదని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందన్నారు. గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వకుందా ప్రభుత్వం పూర్తిస్థాయిలో మోసం చేస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం గురుకుల విద్యార్ధులకు నాణ్యమైన భోజనం ,వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో బాన్సువాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, మోచి గణేశ్, అఫ్రోజ్, నర్సింలు గౌడ్, టేకుల సాయిలు, గంపల శంకర్, రమేశ్, వెంకట్ ఉన్నారు.

BRS leaders arrested