Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:45 pm Posted by : ramakrishna

ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం

 

ఎర్రవెల్లి, బతుకమ్మ :

 

ఎర్రవెల్లిలోని నివాసంలో కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామా రావు తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి పక్షాల ఉప నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా టి. హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనగా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్‌గా సిరికొండ మధుసుదనా చారి హాజరయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, డా. బండ ప్రకాష్ ముదిరాజ్, వి. గంగాధర్ గౌడ్, జోగినపల్లి సంతోష్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, టి. జీవన్ రెడ్డి, సోమా భరత్ కుమార్ గుప్తా, సత్యవతి రాథోడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కెఆర్. సురేష్ రెడ్డి, మహమ్ముద్ అలీ, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో చర్చ జరిగింది.

 

BRS key meeting at Erravelli residence