. ఎమ్మెల్యేల 15 నెలల పనితీరుపై పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ సర్వే
. టాప్ టెన్ లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మొదటి స్థానం
. ద్వితీయ స్థానంలో కేసీఆర్.. మూడో స్థానంలో శ్రీధర్ బాబు
. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఐదో స్థానం
. పదో స్థానంలో కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్
. టాప్ టెన్ లో ఐదుగురు బీఆర్ఎస్.. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయ్యింది. ఈ 15 నెలల కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించగాయి. అసెంబ్లీ లోని 118 మంది ఎమ్మెల్యేల్లో టాప్ టెన్ తోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా, పార్టీల వారీగా టాప్ టెన్ ఎమ్మెల్యేల సర్వే చేపట్టింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రాష్ర్టంలోని 118 నియోజకవర్గాల్లో సర్వే కొనసాగగా, ఒక్కో నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిళ్లను సేకరించింది. కేవలం ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే కొనసాగింది. అయితే 118 మందిలో టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలువగా, ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు కాంగ్రెస్, ఒకరు ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
మొత్తం 118 ఎమ్మెల్యేల్లో మొదటి రెండు స్థానాల్లో మామా అల్లుళ్లు
పనితీరు ఎంతో బాగుందని జనం మెచ్చిన టాప్10 ఎమ్మెల్యేల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రథమ స్థానంలో నిలువగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కేసీఆర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో మంత్రి శ్రీధర్ బాబు, నాల్గో స్థానంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఐదో స్థానంలో బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరో స్థానంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏడో స్థానంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఎనిమిదో స్థానంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయశంకర్, తొమ్మిదో స్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పదో స్థానంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి నిలిచారు.
బీసీ ఎమ్మెల్యేల్లో పాయల శంకర్ కు మొదటిస్థానం
బీసీ సామాజికవర్గానికి చెందిన టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో మొదటిస్థానంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. రాజాసింగ్ రెండో, మంత్రి పొన్నం ప్రభాకర్ మూడో, గంగుల కమలాకర్ నాల్గో, శ్రీనివాస్ యాదవ్ ఐదో, బీలర్ల ఐలయ్య ఆరో, టి పద్మారావు ఏడో, ఆది శ్రీనివాస్ ఎనిమిదో, వాకిటి శ్రీహరి తొమ్మిదో, రామారావు పవార్ పదో స్థానాల్లో నిలిచారు.
ఎస్సీ ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో భట్టి విక్రమార్క
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో మొదటిస్థానంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మొదటిస్థానంలో నిలిచారు. మేడిపల్లి సత్యం రెండో, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మూడో, వంశీ కృష్ణ నాల్గో, వేముల వీరేశం ఐదో, మంత్రి దామోదర రాజనర్సింహ ఆరో, నాగరాజు ఏడో, గడ్డం వివేకానంద ఎనిమిదో, కడియం శ్రీహరి తొమ్మిదో, లక్ష్మీకాంతా రావు పదోస్థానంలో నిలిచారు.
ఎస్టీ ఎమ్మెల్యేల్లో మొదటిస్థానంలో సీతక్క
ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో మంత్రి సీతక్క నిలిచారు. కోరం కనయకయ్య రెండో, పాయం వెంకటేశ్వర్లు మూడో, అనిల్ జాదవ్ నాల్గో, రాందాస్ మాలోత్ ఐదో, తెల్లం వెంకట్రావు ఆరో, బాలు నాయక్ నేనావత్ ఏడో, కోవ లక్ష్మి ఎనిమిదో, రామచంద్ర నాయక్ తొమ్మిదో, వెడ్మ బొజ్జు పదో స్థానంలో నిలిచారు.
మహిళా ఎమ్మెల్యేల్లో మొదటిస్థానంలో సబితారెడ్డి
మహిళా టాప్ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. సీతక్క రెండో, సునీతాలక్ష్మారెడ్డి మూడో, పద్మావతిరెడ్డి నాల్గో, చిట్టం పర్ణికారెడ్డి ఐదో, కోవా లక్ష్మి ఆరో, కొండా సురేఖ ఏడో, రాగమయి ఎనిమిదో, యశస్విని తొమ్మిదో స్థానంలో నిలిచారు.
టాప్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో శ్రీధర్ బాబుకు మొదటిస్థానం
కాంగ్రెస్ కు చెందిన టాప్ 10 ఎమ్మెల్యేల్లో మంత్రి శ్రీధర్ బాబు మొదటిస్థానంలో నిలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో, భట్టి విక్రమార్క మూడో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాల్గో, సీతక్క ఐదో, విజయ రమణరావు ఆరో, పొన్నం ప్రభాకర్ ఏడో, తుమ్మల నాగేశ్వరరావు ఎనిమిదో, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తొమ్మిదో, మైనంపల్లి రోహిత్ పదో స్థానంలో ఉన్నారు.
టాప్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో హరీశ్ రావుకు మొదటిస్థానం
బీఆర్ఎస్ కు చెందిన టాప్ 10 ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీశ్ రావు మొదటి స్థానంలో నిలిచారు. కేసీఆర్ రెండో, వేముల ప్రశాంత్ రెడ్డి మూడో, పల్లా రాజేశ్వర్ రెడ్డి నాల్గో, కేటీఆర్ ఐదో, కల్వకుంట్ల సంజయ్ ఆరో, సబితా ఇంద్రారెడ్డి ఏడో, మాధవరం కృష్ణారావు ఎనిమిదో, సుధీర్ రెడ్డి తొమ్మిదో, సునీతా లక్ష్మారెడ్డి పదోస్థానంలో నిలిచారు.
బీజేపీ ఎమ్మెల్యేల్లో టాప్ స్థానంలో పాయల శంకర్
బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో పాయల శంకర్ మొదటి స్థానంలో, వెంకటరమణారెడ్డి రెండో, రాజాసింగ్ మూడో, రామారావు పవార్ నాల్గో, రాకేశ్ రెడ్డి ఐదో, మహేశ్వ ర్ రెడ్డి ఆరో, ధనపాల్ సూర్యనారాయణ ఏడో, హరీశ్ బాబు ఎనిమిదో స్థానంలో ఉన్నారు.