పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్

స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్,  కేటీఆర్ కి లేదన్నారు. పదేళ్లలో పార్టీలు ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న చరిత్ర వారిదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదని ఎలక్షన్ కమిషన్ అని పేర్కొన్నారు.