Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 4:51 pm Posted by : ramakrishna

బాన్సువాడలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కమీషనర్ సమక్షంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. 1వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ బేగం, 6వ వార్డు కౌన్సిలర్ అంజూమ్ బేగం, 19వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ మాక్బూల్ లను కమిషనర్ శ్రీహరి రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కమీషనర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ జడ్పిటిసి రత్నకుమార్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

BRS councilors take oath in Banswada