Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 7:12 pm Posted by : ramakrishna

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను పట్టణంలోని అంబేద్కర్ చేరుస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. కేసీఆర్ కు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయురోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రత్న కుమార్, అంజిరెడ్డి, ఫెరోజ్,ఖలీల్, అతిఫ్ అజీమ్, షేక్ షారు,పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

 

BRS chief KCR's birthday celebrations