. . . 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పాతిమ జాబిన్.
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఫాతిమా జాబిన్ లాయక్ 18వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డు అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. తమ కుటుంబానికి ఉన్న సేవా దృక్పథాన్ని, గత అనుభవాలను ఈ సందర్భంగా ఆమె ప్రజలకు వివరించారు. గతంలో వార్డ్ మెంబర్ గా సేవలందించిన సమయంలో 18వ వార్డు అభివృద్ధికి ఆమె చేసిన పనులను గుర్తు చేశారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఫాతిమా జాబిన్ లాయక్ హామీ ఇచ్చారు. సమస్య ఏదైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, స్థానిక సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 18వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి తనకు అవకాశం కల్పించాలని ఆమె అభ్యర్థించారు.
