Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2024, 4:03 pm Posted by : ramakrishna

రైతు రుణ మాఫీలపై నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

బతుకమ్మ, బిచ్కుంద : రైతు రుణ మాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ ముందు నుంచి విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త మరియు రుణమాఫీ కానీ రైతులందరూ రేపటి ధర్నాకు స్వచ్ఛందంగా రావాలనిఆయనపిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాల్చర్ బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచిందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణమాఫీలని, చెప్పి ఇప్పుడు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయక ముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి రైతుల తరఫున విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ.. అందుకే ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగుతున్నామని అన్నారు.