బిక్కనూర్, బతుకమ్మ :
భిక్కనూర్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను భిక్కనూరు నుండి కామారెడ్డి మండలానికి తరలించే కుట్ర జరిగిందని టిఆర్ఎస్ నాయకులు అందే మహేందర్ రెడ్డి ,శ్రీనివాస్ లు ఆరోపిస్తూ శనివారం భిక్కనూర్ చౌరస్తా వద్ద శనివారం పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భిక్కనూరు మండలానికి మంజూరైందన్నారు. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సిన ఈ పాఠశాల కోసం స్థల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే ఈ పాఠశాలను కామారెడ్డి మండల కేంద్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఫార్మా కంపెనీల దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ నిర్మాణం చేస్తే ఫార్మా కంపెనీలకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో కామారెడ్డికి తరలించారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
