. నాటి ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పును మోపింది
. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 59,509 వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది
. వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
. కాంగ్రెస్ ది ప్రజాపాలన.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సమానంగా ప్రజలకు అందిస్తున్నాం
. డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: పదేళ్లపాటు రాష్ర్టాన్ని పాలించిన బీఆర్ఎస్ అప్పులతో రాష్ర్టాన్ని, అన్ని ప్రభుత్వ శాఖలను విచ్ఛిన్నం చేసిందని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెలా రూ.59,509 కోట్ల వడ్డీని చెల్లిస్తోందని, అయినప్పటికీ ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సమానంగా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. వారు పదేళ్లలో చేయని అభివృద్ధిని తాము సంవత్సరకాలంలో చేసి చూపించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ కమిటీలను నియమించినట్లు వివరించారు. రైతులకు రుణమాఫీ, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, రైతు భరోసా, పంటల బీమా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక అధికారుల నియామకం వంటి ఎన్నో పనులను రాష్ర్ట ప్రభుత్వం చేసిందన్నారు. ఏడాది కాలంలోనే 50వేల ఉద్యోగాలను భర్తీ, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీఎస్ పీ ఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు.
త్వరలోనే నిజాంషుగర్స్ ను తెరిపిస్తాం
ఎన్నికల హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించదని మోహన్ తెలిపారు. త్వరలోనే నిజం షుగర్స్ ను తెరిపించి ఉత్తర తెలంగాణ రైతులకు మేలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదా అని మానాల ప్రశ్నించారు.
సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వేణురాజ్, జిల్లా ఓబీసీ సెల్ అధ్య క్షుడు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవదళ్ అధ్యక్షుడు సంతోష్, ఫిషరీస్ విభాగం చైర్మన్ శ్రీనివాస్ , నాయకులు అఖిల్, శశికుమార్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.