బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరిక
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సిరికొండ మండలం చీమనపల్లి గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది. బిఆర్ఎస్, బిజెపి కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ రాజకీయాల్లో కొత్త సందేశం ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కండువా కప్పి వారిని ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పేదల పార్టీ. అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, నాయకులు మా వైపు ఆకర్షితులవుతున్నారు” అని...