బి ఆర్ ఎస్, కాంగ్రెస్ దొందు దొందే
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అబద్ధపు మాటలు చెబుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు దొందు దొందే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని 10 ఏళ్ళు యావత్ తెలంగాణ ప్రజలని మోసం చేసి ఒక్క ఇల్లు కూడ పేదోనికి ఇవ్వని ఘనత బి ఆర్...