Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 2:36 pm Posted by : ramakrishna

’నిరుద్యోగులను మోసం చేసేవి బీ ఆర్ ఎస్ ,బీజేపీ పార్టీలు‘

తెలంగాణకు బీజేపీతో ఒరిగింది ఏమీ లేదు

బీజేపీ, బీ ఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ

మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్, బతుకమ్మ :  నిరుద్యోగులను మోసం చేసేవి బీ ఆర్ ఎస్ ,బీజేపీ పార్టీలని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యనించారు. జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. బీజేపీ, బీ ఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం లో భాగంగానే బీ ఆర్ఎస్ పోటీ చేయట్లేదని విమర్శించారు. ఓటమి తప్పదని  బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. బీజేపీ, బీ ఆర్ఎస్ పార్టీలకు బీసీ కుల గణనపై విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణకు బీజేపీతో ఒరిగింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావటానికి బీజేపీ ప్రధాన కారణమన్నారు. బీజేపీ పార్టీ కేవలం మతాన్ని రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుతోందన్నారు. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే, సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్,మా జీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.