Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 8:37 pm Posted by : ramakrishna

పెద్ద మల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన

 

. . . కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు అంటించడంపై నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమల్లరెడ్డి, కాచాపూర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఇలాంటి చీప్ ట్రిక్స్ ను ఉపయోగిస్తుందని ఆరోపించారు. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన అపార భగీరథుడిపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ సిట్ పేరుతో భయపెట్టిస్తే భయపడేవారు కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయ గౌడ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.