. . . కేఆర్ సురేష్ రెడ్డి స్థానం లో వేం నరేందర్ రెడ్డి
. . . రాజ్య సభలో ఇందూర్ ప్రస్థానం ముగింపు
హైదరాబాద్, బతుకమ్మ :
రాజ్యసభ కు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పోటీ పై భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రస్తుత ఎంపీ అభిషేక్ సంఘ్వి పేరును రెండోసారి ప్రతీపాదించింది. అదే సమయంలో రాష్ట్రం నుంచి రెండో సీట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. గురువారం నామినేషన్ ప్రక్రియ ఉండటం తో వారు ఇరువురు తమ అభ్యర్థిత్వలను దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా బిఆర్ ఎస్ తరుపున ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యులు గా ఉన్నా కే ఆర్ సురేష్ రెడ్డి పదవి కాలం ముగిసింది. బిఆర్ఎస్ పెద్దల సభకు పోటీపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. రాజ్యసభ సీటు దక్కాలంటే 40 మందికి పైగా ఎమ్మెల్యేల ఓట్ల కావాలి. అపార్టీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సభ్యులు గెలిచారు. అందులో ఇద్దరు చనిపోగా ఉప ఎన్నికల్లో రెండు సీట్లను కోల్పోయింది. 10 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారిన వ్యవహారం స్పీకర్, ట్రిబ్యునల్ లో ఉంది. దానితో పెద్దల సభకు పోటీకి వెనుకడుగు వేసినట్టు కనిపిస్తుంది. దానితో బిఆర్ఎస్ కు సంఖ్య బలం లేకపోవడం రెండో సీటుకు పోటీలేకపోవడం తో ఏకగ్రీవం కావడం లాంచానమే.

నిజామాబాద్ జిల్లా కు చెందిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్థానం పెద్దల సభలో ముగియడం లాంచానమే కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు కాంగ్రెస్ తరుపున బాల్కొండ ఎమ్మెల్యే గా గెలిచినా సురేష్ రెడ్డి ఒకసారి అసెంబ్లీ స్పీకర్ గా పని చేసారు. చివరి సారిగా తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్మూర్ అసెంబ్లీ స్థానం కు పోటీ చేసి ఓటమి తరువాత బిఆర్ఎస్ లో చేరారు. 2020 లో ఆ పార్టీ ఎంపీ గా రాజ్యసభ కు పంపింది. కేఆర్ సురేష్ రెడ్డి తో పాటు దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ ను పెద్దల సభకు పంపింది. నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరిని ఎంపీ లుగా పెద్దల సభకు ఎంపికయ్యారు. డిఎస్ పదవిలో ఉండగా చనిపోయారు. సురేష్ రెడ్డి పదవికాలం ముగియడం తో రాజ్యసభలో ఇందూర్ జిల్లా శకం ముగిసింది. కేఆర్ సురేష్ రెడ్డి సేవలను బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించు కుంటుందని చర్చ జరుగుతుంది. అది 2027-28 లో కాని సాధ్యం కాదు. అప్పటి వరకు పార్టీ పదవులు కట్టబెట్టే ఆలోచన ఉందని టాక్ నడుస్తుంది.
