- ప్రక్షాళన చేపట్టారు
- “షాడో ఎండి” ఇంటికి
- దుబారా ఖర్చుల నివారణ
- రోజు వారి బిల్లులు ఖాతాల్లోకి
- పాల కేంద్రాలపై నిఘా
హైదరాబాద్, బతుకమ్మ:
ప్రభుత్వానికి భారంగా మారుతున్న విజయ డెయిరీ అనుదినం వినాశనం దిశగా నడుస్తోంది. ఇందులో నిస్వార్ధంగా పనిచేసే కొందరు… సంస్థను బాగుపరచే వారే లేరా…. అనుకుంటూ ఉద్యోగ విధి ధర్మాన్ని నిర్వహించుకుంటున్నారు. అలాంటప్పుడే… సారొచ్చారు…. అదే… మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి… కలుపుకొనిపోవడం కోసం కాదు.. డెయిరీలో వేళ్ళూనుకుపోయిన కలుపు మొక్కలను తీసి పారేయడానికి…గతంలో “బతుకమ్మ” పత్రికలో “షాడో ఎండి ” అని వచ్చిన వార్త కు స్పందించారు. తనకు పిఏగా ఉన్న ‘షాడో ఎండి’ ని ఆ స్థానం నుంచి తప్పించి వేరే దగ్గర పోస్టింగ్ ఇచ్చారు.
- ఇంటి బాట పట్టిన పిఏ..
మాతృ సంస్థ వేరైనా డెయిరీలో ఎండిగా అదనపు బాద్యతలను స్వీకరించారు. వాహనంలో నుంచి ప్రధాన కార్యాలయంలో అడిగిడగానే.. అవినీతి కంపనాలు పాదాలకు తగలడమే గాకుండా, ఏళ్ల తరబడిగా జరుగుతున్న అక్రమాలు కావడంతో గాలి రూపంలో ముక్కు పుటాలకు తగిలాయి. ఎంత కాలం పని చేస్తామో తెలియదు గాని, అంతలోపే ప్రక్షాళన చేయాలనే కసి ఆ క్షణమే కళ్ళల్లో మెరిసింది. ఇన్నాళ్లు గత ఎండీల దగ్గర పిఏగా ఉండటంతో మానసికంగా హింసించినా, గత్యంతరం లేక భరిస్తూనే ఉద్యోగులు పనులు చేసుకున్నారు. శాశ్వత ఉద్యోగులపై ఆంధ్రాకు చెందిన తాత్కాలిక ఉద్యోగి పెత్తనంపై ఆరా తీయగా, మేనేజింగ్ డైరెక్టర్ కు తాను ‘పిఏ’ నంటూ చేసిన ఆకృత్యాలన్ని బహిర్గతమయ్యాయి. ముందుగా పిఏ స్థానం నుంచి తప్పించి, ఏకంగా ఎఫ్ జి ఎస్ (ఫినిష్డ్ గూడ్స్ సెక్షన్) విభాగానికి బదిలీ చేసారు. సంస్థలో పై స్థాయి వారినే గడగడ లాడించిన ‘షాడో ఎండి’,కి ప్రాధాన్యం లేని దానిలో పోస్టింగ్ ఇవ్వడంతో అవమానకరంగా భావించి ఇంటి బాట పట్టాడు.
- లోతుగా విచారణ:
సంస్థకు ఎండిగా వచ్చిన వారిని మెప్పించి, మైమరపించి వారికి పిఏగా చెలామణి అయ్యాడు. దీనిని అడ్డుపెట్టుకొని డెయిరీ నుంచి లాభపడుతూ, సంస్థను నష్టాల బాట పట్టించాడు. ‘బతుకమ్మ’కు అందిన విశ్వశనీయ సమాచారంతో నవంబర్ 26న “షాడో ఎండి” అనే కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత ఎండి బాద్యతలు తీసుకున్నాక పరిస్థితిని క్షుణ్ణంగా పరికించి, పత్రికలో వచ్చిన దానిపై విచారణ చేపట్టగా, చాలా దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లీటరుకు నాలుగు రూపాయలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రుడైన పిఏ తన బంధువుల బినామీ పేర్ల పైన ప్రోత్సాహకాన్ని రూ. లక్షలు జమ చేసుకునేందుకు అప్పటి ఎండితో పాటు, పిఅండ్ఐ లో ఉన్న అధికారి సహకరించారు. దీనికి కృతజ్ఞతగా తన పరపతిని ఉపయోగించి ఆ అధికారి పైన ఉన్న రెండు కేసులను ఎండి చేత తీసివేయించాడనే ప్రచారం జరిగింది.
- దుబారా నివారణ …..
ప్రస్తుతం ఉన్న ఎండి చంద్రశేఖర్ రెడ్డి తన స్వీయానుభవంతో విజయ డెయిరీకి పూర్వవైభవం తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే, గాడి తప్పినా పాలనను తిరిగి పట్టాలపై ఎక్కించేందుకు శక్తి మేర కృషి చేస్తున్నారు. ప్రతి అంశంలో దుబారా ఖర్చును నివారిస్తూ, ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యతనివ్వడంతో, అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. జిల్లాల్లోని పాల కేంద్రాలలో జరుగుతున్న అవినీతిపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇలాంటి అధికారి హయంలో క్రమశిక్షణ గల అధికారులను ప్రాధాన్యత ఉన్న రంగాలలో నియమించి, పదోన్నతులు కల్పిస్తే సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లే అవకాశం ఉంటుంది. అవినీతిని, అక్రమాలను నమ్ముకున్న కొందరు ఉద్యోగులు, ప్రస్తుత ఎండి ఉంటే తమ ఆటలు సాగవని గ్రహించి, బదిలీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంచార్జ్ అధికారిని తీసివేయాలని కోరితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, శాశ్వత ఎండిని నియమించాలని ఉన్నతాధికారుల వద్ద వేడుకున్నారని తెలిసింది.