Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 1:25 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో అన్నాదమ్ముల దుర్మరణం

ఆర్మూర్, బతుకమ్మ: రోడ్డు ప్రమాదంలో అన్నాదమ్ములు ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా పోలీసులువిచారణ చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని దోభీగల్లీకి చెందిన కొండూరు నాగేంద్ర (19), కొండూరు అర్జున్ (21) హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒకరు ఏసీ మెకానిక్ గా పని చేస్తుండగా, మరొకరు హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్నారు. మెట్ పల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని ఇద్దరు కన్నుమూశారు.

Two youths die in road accident