Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 4:18 pm Posted by : ramakrishna

కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ఉషు పోటీల్లో కాంస్య పథకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గత మార్చినెల  24వ తేదీ నుండి 28 తేదీ వరకు ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ లో జాతీయ ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థి బిలాల్ కాంస్య పథకాన్ని సాధించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ బిలాల్ ను సన్మానించారు. కేర్ డిగ్రీ కళాశాల క్రీడలకు ఎప్పుడు పట్టుకొమ్మగా ఉండి క్రీడాకారులను ప్రోత్సహించడంలో  ఎప్పుడు ముందు ఉంటుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ అన్నారు.

Bronze scheme for a CARE Degree College student in the national level Wushu competitions

క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు కూడా తాము అందిస్తున్నట్టు తెలిపారు. తనకు వెన్నంటు ప్రోత్సహించిన కళాశాల యాజమానికి ధన్యవాదాలు అని జాతీయస్థాయిలో కాంస్య పథకం సాధించిన విద్యార్థి బిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తో పాటు ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేష్, కళాశాల ప్రతినిధులు కొయ్యాడా శంకర్, సందేశ్, సందీప్ లు పాల్గొన్నారు.

Bronze scheme for a CARE Degree College student in the national level Wushu competitions