Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2024, 5:11 pm Posted by : ramakrishna

విరిగిన ఆర్టిసి బస్సు స్టీరింగ్ రాడ్

  •  ఆర్టిసి డ్రైవర్ సమయస్పూర్తితో తప్పిన ప్రమాధం
  •  ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్న కామారెడ్డి కలెక్టర్

బతుకమ్మ, రామారెడ్డి: మద్దికుంట నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడు విరగడంతో రామారెడ్డి శివారులో రోడ్డు కిందికి దిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు కిందకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. బుదవారం మద్యహ్నం ఈ సంఘటన జరిగింది. రామారెడ్డి పర్యటన ముగించుకొని కామారెడ్డి వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని డ్రైవర్ చెప్పారు. ప్రయాణికులను మరో బస్సులో కామారెడ్డి పంపించాలని ఆర్టీసీ డ్రైవర్ రాములు కండక్టర్లకు సూచించారు.

Broken RTC bus steering rod