అంగన్‌వాడీ కేంద్రాల్లో వెలుగులు

  . . . ఆరు నెలల్లో 9,800 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) చొరవతో గత ఆరు నెలల్లో 9,800 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇది దాదాపు 90...