Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2024, 12:16 pm Posted by : ramakrishna

బ్రిలియంట్ స్కూల్ బస్సులో మంటలు

. పేలిన బ్యాటరీ

. భయాందోళనకు గురైన విద్యార్థులు

. ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారులు

కామారెడ్డి, బతుకమ్మ: స్కూల్ బస్సులో బ్యాటరీ పేలిన ఘటన కామారెడ్డి జిల్లా  కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న బస్సు రామారెడ్డికి చేరుకోగానే బ్యాటరీ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. బస్సు నిలిచిపోవడంతో స్థానికులు చిన్నారులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనతో భయాందోళన గురైన చిన్నారులు ఏడుస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలంరేపింది. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 50 మంది చిన్నారులు ఉన్నారు.

Brilliant school bus catches fire