కోటి రూపాయల వంతెన వర్షార్పణం
లింగంపేట, బతుకమ్మ : ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో పాముల వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కోతకు గురైంది. దీంతో కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సోమవారం రాత్రి లింగంపేట, గాంధారి మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో పాములవాగుతో పాటు...