నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా నియామకమైన జరిగిన ఎం ఎల్ హెచ్ పి లకు మూడు నెలల బ్రిడ్జి కోర్సును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న ఎమ్మెల్ హెచ్ పి లకు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం, జీవనశైలి వ్యాధులు,ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య కార్యక్రమాల ఆన్లైన్ ఎంట్రీ, పిసిపిఎన్డిటి, జాతీయ ఆరోగ్య మిషన్ అంశాలపై మూడు నెలలు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో ఉమ్మడి జిల్లాకు చెందిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఎమ్మెల్ హెచ్ పి లను ఎంపిక చేశారని తెలిపారు.. ఈ శిక్షణా కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడునని కావున ఎంపిక చేయబడిన అందరూ ఏం ఎల్ హెచ్ పి లు క్రమం తప్పకుండా హాజరై వివిధ ఆరోగ్య అంశాల్లో నైపుణ్యత సాధించి ప్రజారోగ్య పరిరక్షణకు సిద్ధం కావాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ రాజు, డిహెచ్ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.
