Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 4:05 pm Posted by : ramakrishna

అర్థాంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణ పనులు

  • కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా..? పాలకుల నిర్లక్ష్యమా..?
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, గ్రామస్తులు

 

రుద్రూర్, బతుకమ్మ: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారు నుండి బోధన్ వైపుకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ. 301.50 లక్షల వ్యయంతో,  2023వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే అర్థంతరంగా నిలిపివేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదని, పనులను మధ్యలోనే నిలిపివేశారని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేయడంలో అంతర్యం ఏమిటని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా?.. పాలకుల నిర్లక్ష్యమా? అనేది అర్థం కాని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు.

Bridge construction work stalled

రాయకూర్ గ్రామం నుండి బ్రిడ్జి వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఈ విషయంపై బోధన్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా సబ్ కలెక్టర్ స్పందించలేదని గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతే పోతంగల్ మండలం, కోటగిరి మండలం, రుద్రూర్ మండలాల్లోని గ్రామస్తులకు, రైతులకు బోధన్ వెళ్లడానికి కేవలం 5 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో సులువుగా వెళ్లొచ్చన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Bridge construction work stalled