. . . ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
వెబ్ డెస్క్, బతుకమ్మ :
భర్త చనిపోవడం తో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళను డబ్బుల కోసం వేదిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఏసీబీ కి చిక్కారు. ఈ సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మపూర్ పంచాయతీ సెక్రటరీ లావుడ్యా చవాన్ లాల్ వితంతు పింఛన్ ఇవ్వడానికి రూ. 10 వేల లంచం తీసుకుంటాండగా అవినీతి నిరోధక శాఖధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్ట్ ముందు హాజరు పరుచగా నాయస్థానం అతనికి రిమాండ్ తరలించింది.