. . . లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎంహెచ్ వో వ్యక్తిగత సహాయకుడు
. . . రంగారెడ్డి డీఎంహెచ్ వోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
రంగారెడ్డి, బతుకమ్మ :
ఎల్.బి.నగర్‌లోని ఓ ఫిజియోథెరపీ సెంటర్‌ను రీ-ఓపెన్ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై డీఎంహెచ్ వో స్వర్ణకుమారిని సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు లక్షలు డిమాండ్ చేసిన చివరకు లక్ష రూపాయలు ఇస్తేనే ఫిజియోథెరఫి సెంటర్ రీఓపెన్ అని డీఎంఅండ్ హెచ్ వో , హెల్త్ ఇన్స్ పెక్టర్ ఒత్తిడి చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం బాధితుడి నుంచి ఎల్.బి.నగర్ వద్ద లక్ష రూపాయలు తీసుకుంటుండగా సహాయకుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ తీసుకుంటుండగా రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ ప్రైవేట్ డ్రైవర్ కృష్ణయ్యకు డబ్బులు ఇచ్చి కారులో పెడుతుండగా పట్టుబడ్డారు. వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలం, దొరికిన ఆధారాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న డీఎంహెచ్ వో స్వర్ణకుమారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని శివరాంపల్లిలోని కార్యాలయానికి తరలించారు. డీఎంహెచ్ వో స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్, అతని ప్రైవేట్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.