Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 7:04 pm Posted by : ramakrishna

రిటైర్ మెంట్ బెనిపిట్స్ కోసం లంచం డిమాండ్

 

. . . ఏసిబికి చిక్కిన స్కూల్ రికార్డ్ అసిస్టెంట్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగినికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిపిట్స్ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కారు. ఏసిబి సిటి రెంజ్ -2 అధికారులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ అమిర్ పేట్ గవర్నమెంట్ హైస్కూల్ డిప్యూటి ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ ఎస్ శివానంధ్ సోమవారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండేడ్ గా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక వ్యక్తి తన తల్లికి సంబంధించిన పదవి విరమణ పొందిన బెనిపిట్స్ కోసం రికార్డ్ అసిస్టెంట్ ను సంప్రదించగా అతను లంచం కోరడంతో ఏసిబి అధికారులను ఆశ్రయించగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రికార్డు అసిస్టెంట్ శివానంద్ పై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసిబి ప్రత్యేక కోర్టులో హజరు పరిచారు. న్యాయస్థానం శివానంధ్ కు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు.