Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:46 pm Posted by : ramakrishna

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకుర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రత్నకుమారి, ఆశా కార్యకర్త, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.