రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ – 8 లో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరమన్నారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పద్మ, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.