తల్లి పాలు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో కీలకం

  . . . గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి   ఏర్గట్ల, బతుకమ్మ :   తల్లిపాలు శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతో కీలకమని గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏర్గట్ల మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం...