Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 7:28 pm Posted by : ramakrishna

విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్ లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు

  • ఎం.డి డాక్టర్ రాస విజయ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫ్యూజీ ఫిలిం సహకారంతో నిజామాబాద్ నగరంలోని విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో  అత్యాధునిక పరికరాలతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చాయని సెంటర్ ఎం.డి రాస విజయ్ వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణ  సేవలకు సంబంధించి కార్యక్రమాన్ని శుక్రవారం  జ్యోతి ప్రజ్వాల్న చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ లోనె తొలిసారిగా నిర్ధారణ సేవలు ప్రారంభించినట్లు విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, పెరిడాంటిస్ట్ డాక్టర్ రాస విజయ్ తెలిపారు. హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన  ఫ్యుజి ఫిల్మ్ ఇండియా సంస్థ  నగరంలోని విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో తమ అత్యాధునిక ఆమ్యులెట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫిల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫి ( ఎఫ్ఎఫ్డిఎం ) వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితులు హైదరాబాద్ కు వెళ్లకుండా అతి తక్కువ ధరలలో నాణ్యమైన   ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చని అన్నారు. నిర్ధారణ పరీక్షల్లో దట్టమైన రొమ్ము కణజాలాల్లో కూడా చాలా త్వరగా అత్యంత సృష్టంగా చిత్రాలను తీస్తుందన్నారు. దీంతో మహిళల ఆరోగ్యపరీక్షలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు వేశామన్నారు. మేము చేపట్టిన త్వరగా గుర్తించండి త్వరగా పోరాడండి అనే సిఎస్ఆర్ ప్రచారానికి కూడా మహిళల రొమ్ము క్యాన్సర్ పరీక్షల విషయంలో మద్దతిస్తుందన్నారు. మహిళల ఆరోగ్యం త్వరగా గుర్తించడం అనే విషయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సేవలను  నిజామాబాద్ జిల్లా తో పాటు,ఇతర జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్యాన్సర్ నిర్ధారణతో పాటు ఇతరాత్రా రోగాలకు సంబంధించి  పరీక్షలు అతి తక్కువ ధరకే నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు నిర్ధారణ పరీక్షలపై  అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యుజీ ఫిల్మ్ ఇండియా అడ్వైజర్ షున్ సుకే హోండా,డాక్టర్ వివేకానంద,గైనకాలజిస్ట్ అరుణ,డాక్టర్ ముకుంద్, ఆస్పత్రి సిబ్బంది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.