విద్యార్థులకు అల్పాహారం అందజేత
ఆర్మూర్, బతుకమ్మ : ఆలూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆలూరు పిఎసిఎస్ చైర్మన్ తంబూరు శ్రీనివాస్ ఆద్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తంబూరి శ్రీనివాస్, సీఈఓ మల్లేష్ , సాయిరెడ్డి, చింటూ, గంగాధర్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.