Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 9:16 pm Posted by : ramakrishna

స్నూకర్ పార్లర్ వద్ద గొడవ

  • యువకుడిపై రాడ్లతో ఆన్ లైన్ బెట్టింగ్ గ్యాంగ్ దాడి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆన్ లైన్ బెట్టింగ్ దందా మూడుపువ్వులు ఆరు కాయాలుగా సాగుతుంది. ఆఫ్ లైన్ లో క్యారమ్, స్నూకర్ లపై బెట్టింగ్ నిర్వహించి కాసులు దండుకుంటున్నారు నిర్వాహకులు. పోలీసులు మాత్రం నగరంలో ఎలాంటి జూదం, ఆన్ లైన్ బెట్టింగ్, ఆఫ్ లైన్ బెట్టింగ్ లు జరుగడం లేదని చెబుతుండగా బుదవారం రాత్రి స్నూకర్ పార్లర్ వద్ద యువకుడిపై ఆన్ లైన్ బెట్టింగ్ దందా నిర్వాహకులు రాడ్లతో దాడి చేశారు. నగరంలోని బోదన్ రోడ్డులో సిటి హస్పిటల్ వద్ద ఉన్న రషీద్ కు చెందిన స్నూకర్ పూల్ ( పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేని) వద్ద  బర్కత్ పుర కు చెందిన బాసన్ ఖాన్ పై ఆన్ లైన్ లో బెట్టింగ్ కాసే గున్నా గ్యాంగ్ గొడవపడ్డారు. ఆతను స్నూకర్ పూల్ వద్ద కిందకు దిగగానే రోడ్డుపై రాడ్లతో దాడి చేసింది. ఈ దాడిలో బాసన్ ఖాన్ తల పగిలి తీవ్ర రక్త స్రావం జరిగింది. అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా తలపై ఎనిమిది కుట్లు వేసినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు ఒకటవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Brawl at the snooker parlour